ETV Bharat / crime

attack: మద్యం మత్తులో ఘర్షణ.. ఒకరు మృతి - confrontation between two young mens at gudiwada railway station

మద్యం మత్తులో ఘర్షణ
మద్యం మత్తులో ఘర్షణ
author img

By

Published : Sep 17, 2021, 7:43 AM IST

Updated : Sep 17, 2021, 9:28 AM IST

07:41 September 17

మద్యం మత్తులో ఇద్దరు యువకులు మధ్య ఘర్షణ

   కృష్ణా జిల్లా గుడివాడ రైల్వే స్టేషన్ వద్ద మద్యం మత్తులో ఇద్దరు యువకులు మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువకుడు మృతిచెందాడు. పట్టణానికి చెందిన రాపానీ ఏసు, బత్తుల సాయికుమార్​ అనే ఇద్దరు కలిసి రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం రాత్రి మద్యం సేవించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటలతో మొదలైన గొడవ.. ఇద్దరి మధ్య ఘర్షణకు దారితీసింది. సాయి కుమార్​పై గొడ్డలితో ఏసు దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ సాయికుమార్​ను స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం వైద్యులు విజయవాడకు తరలించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయికుమార్ మృతి చెందాడు. ఈ ఘటనపై గుడివాడ టూటౌన్​ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీచదవండి..

RAPE ATTEMPT: తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడు అరెస్టు

Last Updated : Sep 17, 2021, 9:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.