SI Video Viral: నెల్లూరు జిల్లా మర్రిపాడు ఎస్సై వెంకటరమణకు పోలీసు ఉన్నతాధికారులు ఛార్జి మెమో ఇచ్చారు. నిన్న మర్రిపాడు బస్టాండ్ సెంటర్లో... చలానా విషయంలో విద్యార్థిపై ఎస్‌ఐ దురుసుగా ప్రవర్తించటం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థిని... ఎస్‌ఐ ఈడ్చుకుని వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని... ఎస్పీ విజయరామారావు ఆదేశించారు. వెంకటరమణ ఎక్కడ పని చేసినా... ప్రవర్తన వివాదాస్పదంగానే ఉంటుందని పలువురు అంటున్నారు.
Video Viral: నెల్లూరులో ఎస్సై వీరంగం.. వీడియో వైరల్