politicians arrested for playing poker: తెలంగాణలోని మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పరిధిలో పేకాడుతూ పలువురు ప్రముఖులు అరెస్ట్ అయ్యారు. వారిలో జవహర్‌నగర్ పరిధిలోని కార్పొరేటర్లు ఉండడం సంచలనంగా మారింది. కీసరలోని ఓ రిసార్టులో పలువురు పేకాట ఆడుతున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు పోలీసుల బృందం దాడులు నిర్వహించి ఏడుగురిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.65 వేలు, 5 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టైన వారిలో జవహర్‌నగర్ పరిధి కార్పొరేటర్ మనోహర్ రెడ్డి, మూడో డివిజన్ కార్పొరేటర్ భర్త బల్లి శ్రీనివాస్, నాలుగో డివిజన్ కార్పొరేటర్ భర్త వెంకటేశ్ ఉన్నారు. వీరిని పోలీసులు కీసరలోని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చదవండి: Redsandal Seized in Chittoor: శేషాచలంలో కూంబింగ్.. కూపీ లాగారు.. డొంక కదిలింది!