ETV Bharat / crime

బోయిన్​పల్లి పీఎస్​కు అఖిలప్రియ.. గంటన్నరపాటు విచారణ - Bowenpally Police station

ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్​ కేసులో ప్రధాన నిందితురాలైన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బోయిన్​పల్లి పోలీస్ స్టేషన్​కు హాజరయ్యారు. సికింద్రాబాద్ కోర్టు ఆదేశానుసారం ఏసీపీ నరేశ్ రెడ్డి సమక్షంలో సంతకం చేశారు.

bhuma-akhil
bhuma-akhil
author img

By

Published : Feb 1, 2021, 2:07 PM IST

కిడ్నాప్​ కేసులో ప్రధాన నిందితురాలు భూమా అఖిలప్రియ హైదరాబాద్ బోయిన్​పల్లి పీఎస్​కు హాజరై ఏసీపీ నరేశ్ రెడ్డి సమక్షంలో సంతకం చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా అఖిలప్రియను పోలీసులు పలు ప్రశ్నలు అడిగారు. తమ విచారణకు ఆమె సహకరించినట్లు ఏసీపీ తెలిపారు.

ఉదయం పది గంటలకు బోయిన్​పల్లి పీఎస్​కు వెళ్లిన అఖిలప్రియ.. గంటన్నరపాటు స్టేషన్​లోనే ఉండి విచారణకు సహకరించారు. ప్రతి 15 రోజులకోసారి పోలీస్ స్టేషన్​కు హాజరై సంతకం చేయాలని సికింద్రాబాద్ కోర్టు ఆమెకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో మరో నిందితుడు భార్గవ్ రామ్​ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు ఏసీపీ నరేశ్ రెడ్డి తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.