ETV Bharat / crime

Rape: హైదరాబాద్​లో యువతిపై అత్యాచారం.. ఒక్కడేనా? సామూహికమా? - rape news in Hyderabad

హైదరాబాద్​ నగరంలోని ఓ ల్యాబ్​లో టెక్నీషియన్​గా విధులు నిర్వహించే ఆమె.. రోజూలాగే ఆరోజూ ఉద్యోగానికి బయలుదేరింది. మధ్యాహ్నం షిఫ్ట్ అవ్వడం వల్ల 2.30 గంటల సమయంలో ఆటో ఎక్కింది. యువతి ఒక్కతే ఉండటం గమనించిన ఆ ఆటో డ్రైవర్ మనసులో దుర్బుద్ధి పుట్టింది. ఆమె వెళ్లాల్సిన దారిలో తీసుకెళ్లకుండా ఆటోను దారి మళ్లించాడు. గుర్తించిన యువతి.. తప్పుదారిలో తీసుకెళ్తున్నారెందుకు అనడిగితే.. ఇదే దగ్గరి దారంటూ చెప్పాడు. ఆపై ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

crime
crime
author img

By

Published : Aug 19, 2021, 9:56 AM IST

హైదరాబాద్ నగరంలో పట్టపగలే దారుణం జరిగింది. తాను పనిచేసే ప్రాంతానికి వెళ్లేందుకు యువతి ఆటో ఎక్కగా, దగ్గరి దారంటూ దారిమళ్లించిన డ్రైవర్‌.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సంతోష్‌నగర్‌ ఠాణా పరిధిలో బుధవారం జరిగిన ఘటన నగరంలో కలకలం సృష్టించింది.

హైదరాబాద్‌ సంతోష్‌నగర్‌ పరిధిలో నివసిస్తున్న యువతి (20) మైలార్‌దేవ్‌పల్లిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. అక్కడికి వెళ్లే క్రమంలో బుధవారం మధ్యాహ్నం 2.30గంటల ప్రాంతంలో ఆటో ఎక్కింది. ఆటోను దారి మళ్లించిన డ్రైవర్‌ ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితికి చేరిన బాధితురాలిని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. సాయంత్రం వరకు అక్కడే ఉండిపోయిన ఆమె తర్వాత తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

"బాధితురాలు ఇంకా షాక్‌లో ఉన్నందున వివరాలు సక్రమంగా చెప్పలేకపోతోంది. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందా? ఒక్కడే అఘాయిత్యానికి పాల్పడ్డాడా? అనేది తెలుసుకునేందుకు బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించాం. వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఆటో డ్రైవర్‌ కోసం గాలిస్తున్నాం’" అని దక్షిణ మండలం డీసీపీ గజరావ్‌ భూపాల్‌ తెలిపారు.

గాలింపు ముమ్మరం

బాధితురాలు తెలిపిన వివరాల ఆధారంగా సంతోష్‌ నగర్‌ పోలీసులు, దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాధితురాలు ఆటో ఎక్కిన ప్రాంతం నుంచి ప్రధాన రహదారి, అనుసంధాన రహదారులు, నిర్మానుష్య ప్రాంతాలకు దారితీసే చోట్ల సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. వాటిల్లో కనిపించిన ఆటోలు ఏ మార్గం నుంచి వెళ్లాయో ఆరా తీస్తున్నారు. సంతోష్‌ నగర్‌ నుంచి మైలార్‌దేవ్‌పల్లి, పహాడీషరీఫ్‌ ప్రాంతాల్లో సెల్‌ టవర్‌ సిగ్నళ్లనూ విశ్లేషిస్తున్నారు. ఆటో డ్రైవర్లనూ విచారిస్తున్నారు.

ఇదీ చదవండి:

కాబుల్ To భారత్: శ్రీకాకుళం వాసి.. ఆర్మీ సీనియర్ కమాండో రాజశేఖర్ మాటల్లో...!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.