కృష్ణా పుష్కరఘాట్ వద్ద యువతిపై అత్యాచారం నిందితులను పట్టుకునేందుకు తాజాగా ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసులను రంగంలోకి దింపారు. గురువారం నుంచి నిందితుల కోసం కృష్ణా నది పరివాహక ప్రాంతం, మంగళగిరి, ఇబ్రహీంపట్నం అటవీ ప్రాంతాలతోపాటు బందరులో జల్లెడ పడుతున్నారు. ఈ కేసు విషయంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి, హోంమంత్రి స్పందించారు. హోంమంత్రి సుచరిత, మంత్రి తానేటి వనితలు 3 రోజుల కిందట నిందితుల ఆచూకీ లభ్యమైందని.. మీడియా ముందు ప్రవేశపెడతామని చెప్పారు. తీరా నిందితులు ఇంకా పట్టుబడక కేసు దర్యాప్తు పోలీసులకు ప్రతిష్ఠాత్మకంగా మారింది.
ఇదీ చదవండి: Exams Cancelled: పది, ఇంటర్ పరీక్షలు రద్దు.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం