ETV Bharat / crime

Crime news: వ్యక్తి హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు... ఎక్కడంటే..? - ఏపీ తాజా నేర వార్తలు

రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో ప్రమాదాలు, ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిల్లో ఆరుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. పల్నాడు జిల్లాలో వ్యక్తి హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు విధించారు. ప్రకాశం జిల్లాలో పురిట్లోనే బిడ్డ మృతి చెందింది.

ap crime news today
ఏపీ నేర వార్తలు
author img

By

Published : Apr 21, 2022, 6:09 PM IST

Updated : Apr 21, 2022, 11:51 PM IST

వ్యక్తి హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు: పల్నాడు జిల్లా వ్యక్తి హత్య కేసులో నలుగురికి నరసరావుపేట 13వ అదనపు సెషన్స్‌ జడ్జి జీవిత ఖైదు విధించారు. 2017లో నాదెండ్ల మండలం పొనుగుపాడులో హత్య జరిగిన విషయం తెలిసిందే. సొంత బావతో వివాహేతర సంబంధం కారణంగా భర్తను భార్య హత్యచేసింది. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం... మృతుడి భార్య శ్రీలక్ష్మితో పాటు మరో ముగ్గురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది.

ప్రకాశం జిల్లా: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలలో పురిట్లోనే బిడ్డ మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రసవం కోసం నిన్న కోటేశ్వరి అనే గర్భిణి... ప్రభుత్వ వైద్యశాలలో చేరగా... పురిట్లోనే పసికందు మరణించింది. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళనకు దిగారు.

నెల్లూరు జిల్లా: నెల్లూరు జిల్లా కోవూరు మండలం వేగూరు గ్రామంలో ఈ నెల 16న జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వీరి నుంచి హత్యకు ఉపయోగించిన స్కూటీ, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. వేగూరు హరిజనవాడకు చెందిన చిన్నమ్మకు శివయ్య అనే వ్యక్తితో 24ఏళ్ల క్రితం వివాహమైంది. కొంత కాలం సజావుగా సాగిన వీరి కాపురంలో కలతలు రావడంతో శివయ్య మాధురి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి వంశీ, నితీష్ అనే ఇద్దరు కుమారులున్నారు. అయితే గత కొంత కాలంగా శివయ్య మొదటి భార్య అయిన చిన్నమ్మ వద్దకు వెళ్లి అక్కడే ఉంటున్నాడు. తండ్రి తమ ఇంటికి రాకపోవడానికి చిన్నమ్మ కారణమని కక్ష్య కట్టిన రెండో భార్య కుమారులు... తల్లి వరసయ్యే మహిళను కత్తులతో పొడిచి కిరాతకంగా హతమార్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు వంశీ, నితీష్​లను అరెస్ట్ చేశారు. పథకం ప్రకారమే మహిళను కిరాతకంగా హత్య చేశారని డీఎస్పీ హరనాథ్ రెడ్డి తెలిపారు.

* నెల్లూరు జిల్లాలో నాటు సారా తయారీ ప్రాంతాలపై పోలీసులు దాడులు చేస్తున్నారు. గ్రామాల్లో నాటుసారా తయారు చేస్తే పిడి యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని ఆత్మకూరు సెబ్ సీఐ నయనతార హెచ్చరించారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏఎస్​పేట మండలం గుడిపాడు గ్రామంలో సెబ్ అధికారులు, పోలీసులు నాటుసారాపై కార్డెన్ సెర్చ్​ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా కాయకుండా ప్రతిజ్ఞ చేయించి అవగాహన కల్పించారు. గ్రామాలన్నీ నాటుసారా రహిత గ్రామాలుగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

వ్యక్తి అనుమానాస్పద మృతి: సారా తయారీ ప్రాంతాలపై పోలీసులు దాడులు బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలో అనుమానస్పద స్థితిలో వ్యక్తి కాలువలో పడి మృతి చెందాడు. రాంభొట్ల వారిపాలెం గ్రామ శివారులోని నందికట్ట కాలువలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు... పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటికి తీయించారు. మృతుడు పిట్టలవానిపాలేం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన కె.రవికుమార్ (35)గా గుర్తించారు. మంగళగిరి ఆరవ బెటాలియన్​లో హోమ్​గార్డ్​గా విధులు నిర్వహిస్తున్నాడని బంధువులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో భర్త మృతి... భార్యకు తీవ్ర గాయాలు: శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం జాతీయ రహదారి బెజ్జిపురం కూడలి వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైకుపై వెళ్తున్న దంపతుల్లో భర్త అక్కడికక్కడే మృతి చెందారు. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనంపై భార్యాభర్తలు శ్రీకాకుళం నుంచి విజయనగరం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులు విజయనగరం జిల్లా పోల్​బాగా కూడలికి చెందిన వారిగా రాజు(46), సుజాతగా గుర్తించారు. కారు డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గాయపడిన మహిళను 108 వాహనంలో చికిత్స నిమిత్తం శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్​కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ఏలూరు జిల్లా: అప్పుల బాధతో బ్యాంకు మేనెజర్​ ఆత్మహత్య: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సాయి బాలాజీ టౌన్​షిప్​లో అప్పుల బాధ తాళలేక ప్రైవేట్ బ్యాంకు మేనేజర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మారిశెట్టి నాగరాజు(35) ప్రైవేట్ బ్యాంకు మేనేజర్​గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బయటి నుంచి కొంత మొత్తాన్ని వడ్డీకి తీసుకున్నాడు. నాగరాజును ఇచ్చిన అప్పును తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో... మనస్తాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకున్నాడని బంధువులు తెలిపారు. మూడు పేజీల సూసైడ్ నోట్ రాసి...ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని సోదరుడు తెలిపారు. మృతుడు నాగరాజుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

విశాఖ జిల్లా: విశాఖ జిల్లా ఎలమంచిలి సమీపంలోని పెద్దపల్లి వద్ద కారు... ప్రమాదవశాత్తు కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా... మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించారు.

* విశాఖ జిల్లా అల్లిపురం జైపూర్ లాడ్జిలో పోలీసులు గంజాయి సీజ్​ చేశారు. కేరళకు చెందిన ఇద్దరి నుంచి 8 కిలోల లిక్విడ్ గంజాయి స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు.

ఎన్టీఆర్​ జిల్లా: విజయవాడ అజిత్‌ సింగ్ నగర్ పరిధిలో పలువురు క్రికెట్ బుకీలను పోలీసులు అరెస్టు చేశారు. మూడు ల్యాప్‌టాప్‌లు, 14 సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు.

పార్వతీపురం జిల్లా: పాచిపెంట మండలం పోతులగడ్డ వంతెన వద్ద ఆటో బోల్తా పడి ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులు పాఠశాల నుంచి ఆటోలో సొంతూళ్లకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

కర్నూలు జిల్లా: ఆదోనిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బిల్లులు లేకుండా రవాణా చేస్తున్న 51 కిలోల వెండి, రూ.31 వేలు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు చెందిన వ్యక్తిని అదుపులో తీసుకున్నారు.

విద్యార్థులపై తెేనెటీగల దాడి: కాకినాడ సాలిపేట హైస్కూల్‌లో విద్యార్థులపై తేనెటీగల దాడి చేశాయి. తేనెటీగల దాడిలో 13 మంది విద్యార్థులకు గాయాలుకాగా... ఆస్పత్రికి తరలించారు.

గుంటూరు జిల్లా: గుంటూరు జీజీహెచ్‌లో పైకప్పు పెచ్చులు రాలిపడ్డాయి. గర్భిణీల వార్డు కారిడార్‌లో పైకప్పు పెచ్చులు ఊడాయి. ఘటన సమయంలో
ఎవరూ లేకపోవడంతో ముప్పు ప్రమాదం తప్పింది.

వైఎస్ఆర్ జిల్లా: వల్లూరు వద్ద బైక్‌ను టిప్పర్​ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా... ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులను 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు.

నంద్యాల జిల్లా: గోస్పాడు మండలం ఎం.చింతకుంట శివారులో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.1.5 లక్షలు, 6 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో 9 మంది నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

కోనసీమ జిల్లా: అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలలో 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వైద్య విద్యార్థులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని కిమ్స్‌ సూపరింటెండెంట్‌ తెలిపారు.

తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా: తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండంల చౌదరిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. నీటిగుంతలో పడి యువకుడు మృతిచెందాడు. మృతుడు వైఎస్‌ఆర్‌ జిల్లా రైల్వేకోడూరుకు చెందిన బీటెక్‌ విద్యార్థి చరణ్‌ గుర్తించారు. వెల్దండలో ఓ పెళ్లి వేడుకలో పాల్గొని తిరిగెళ్తుండగా ప్రమాదం జరిగింది.

శ్రీసత్యసాయి జిల్లా: శ్రీసత్యసాయి జిల్లాలో ఇద్దరు నకిలీ బంగారం విక్రేతలను పోలీసులు అరెస్టు చేశారు. అగళి మండలం జంగమరణహల్లిలో నకిలీ బంగారం విక్రయిస్తుండగా.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.11 లక్షలు, 3 కిలోల నకిలీ బంగారాన్ని స్వాధీనం చేస్తున్నట్లు చెప్పారు.

నంద్యాల జిల్లా: నంద్యాల జిల్లాలో ఎర్రచందనం తరలించే 15 మంది తమిళ కూలీలను మహానంది పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి కూలీలను మహానందిలో విడిచి స్మగ్లర్లు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు..ఇద్దరిపై కేసునమోదు చేశారు. కూలీలు.. యాత్రికుల్లా మహానంది ఆలయ ఆవరణలో బస చేసినట్లు పోలీసుల విచారణలో తెలింది.

తిరుపతి: పోలీసుల పేరుతో దోపిడీ చేస్తున్న ఏడుగురిని తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద రూ.88 లక్షలు, కారు స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డి వెల్లడించారు. నరసరావుపేటకు చెందిన బంగారు వ్యాపారి.. గుంటూరు నుంచి చెన్నై వెళ్తుండగా తిరుపతిలో దారికాచి రూ.90 లక్షలు దోపిడీకి పాల్పడ్డారు.

పల్నాడు జిల్లా: దాచేపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. నడికుడి వద్ద కారును ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చదవండి: Sexual assault: విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో దారుణం... బాలికపై ఒప్పంద ఉద్యోగి ఘాతుకం

Last Updated : Apr 21, 2022, 11:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.