ETV Bharat / crime

డబ్బులతో చిట్టిల వ్యాపారీ పరారీ, అవమానంతో భార్య ఆత్మహత్య - చిట్టీ వ్యాపారం

Women Committed to Suicide చిట్టి వ్యాపారం నడిపి డబ్బులతో పరారయ్యాడు ఓ భర్త. చిట్టి కట్టిన బాధితులు ఇంటి మీదకు వచ్చి నిరసన చేపట్టారు. దీనిని అవమానంగా భావించిందేమో అతని భార్య. బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది.

మరణానికి దారీ తీసిన చిట్టీ వ్యాపారం
మరణానికి దారీ తీసిన చిట్టీ వ్యాపారం
author img

By

Published : Aug 22, 2022, 7:47 PM IST

Women Committed to Suicide: గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో వెంకటేశ్వరరావు చిట్టి వ్యాపారం నడిపించేవాడు. అతని భార్య లక్ష్మి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వెంకటేశ్వరరావు గ్రామస్తుల నుంచి చిట్టీల రూపంలో 50 కోట్లు వసూలు చేశాడు. ఈ వసూలు చేసిన నగదుతో గత ఏడాది పరారయ్యాడు. పరారైన వెంకటేశ్వరరావు గత నెల గ్రామానికి వచ్చాడు. ఇంటికి వచ్చిన వెంకటేశ్వరరావుకు నగదు బాధితుల నుంచి నిరసన సెగ తగిలింది. గత కొంత కాలంగా బాదితులు, వెంకటేశ్వర రావు ల మద్య తీవ్ర వివాదం చెలరేగుతోంది. కొన్ని రోజల క్రితం బాధితులు వెంకటేశ్వర ఇంటిపై దాడి చేసి అతని కుమారుడు శ్రీనివాసరావుని అపహరించారు.

తమకు డబ్బులు ఇస్తేనే కుమారుడిని వదిలిపెడతామని.. బెదిరించడంతో వెంకటేశ్వరరావు పోలీసులను ఆశ్రయించాడు. ఇలా వరుస ఘటనల నేపధ్యంలో వెంకటేశ్వరరావు భార్య సమీప నివాసంలో ఉన్న బావిలో శవమై కనిపించింది. డబ్బులు విషయంలో ఇంట్లో తరచు గోడవలు జరుగుతున్నాయని, చిట్టిల డబ్బులపై తీవ్ర మనస్థాపంతోనే భార్య ఆత్మహత్య చేసుకుందని గ్రామస్తులు అంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.