ETV Bharat / crime

పేకాట వ్యసనం.. 50 లక్షలతో పరారీ..

author img

By

Published : Apr 9, 2021, 11:00 AM IST

మంచి చదువు చదివి.. హైదరాబాద్​లోని ప్రైవేట్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్​గా చేరిన ఓ వ్యక్తి ఆన్​లైన్ పేకాటకు అలవాటు పడ్డాడు. అది కాస్తా వ్యసనంగా మారింది. ఈ నేపథ్యంలో ఉన్న ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత ప్రైవేట్ స్థిరాస్తి వ్యాపార సంస్థలో చేరి అక్కడ 50 లక్షల రూపాయలు తీసుకెళ్లి... చివరికి కటకటాల పాలయ్యాడు.

Poker game addiction
పేకాట వ్యసనం.. 50 లక్షలు స్వాహా

ఆన్​లైన్​ పేకాట వ్యసనం కారణంగా ఓ వ్యక్తి ఉద్యోగం పోయింది. అంతేకాదు మరో ప్రైవేటు కంపెనీలో చేరిన అతను 50 లక్షలు తీసుకుని ఉడాయించాడు. చివరకు బుక్కయ్యాడు. ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళంకు చెందిన నవీన్ బెంగళూర్​లో బ్యాంకింగ్ సేవల్లో డిప్లొమా పూర్తి చేసి హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్​గా చేరాడు. ఈ క్రమంలో ఆన్​లైన్​లో పేకాటకు బానిసై అప్పుల పాలయ్యాడు. చివరికి ఉన్న ఉద్యోగం పోగొట్టుకున్నాడు. 2020 జూన్​లో పెద్ద అంబర్​పేట్​లో ఉన్న జేబీ ఇన్​ ఫ్రా స్థిరాస్తి సంస్థలో అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్​గా చేరాడు.

ఈ నేపథ్యంలో కంపెనీ మేనేజర్ ఓ రోజు నవీన్​కు 50 లక్షల రూపాయలు ఇచ్చి మరుసటి రోజు బ్యాంకులో జమ చేయాలని సూచించాడు. 50 లక్షలు తన గదికి వెంట తీసుకెళ్లిన నవీన్​కు దురాలోచన పుట్టింది. తన వద్ద ఉన్న డబ్బుతో ఆన్​లైన్ పేకాట ఆడి ఒకే రోజు 12 లక్షలకుపైగా నష్టపోయాడు. మరుసటి రోజు కంపెనీ మేనేజర్ నుంచి ఫోన్ వచ్చినా... స్పందించలేదు. వెంటనే తన వద్ద ఉన్న మిగిలిన డబ్బులను తీసుకుని పలాసకు వెళ్లాడు. అక్కడ తన మామ రామకృష్ణకు ఐదు లక్షలు ఇచ్చాడు. మిగిలిన డబ్బులను తీసుకుని ఇంకో బంధువు అమిత్ రెడ్డితో కలిసి కలకత్తా వెళ్లి జల్సా చేయసాగాడు. జేబీ ఇన్ ఫ్రా సంస్థ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. నిందితుల నుంచి రూ.28.7 లక్షల నగదు, మూడు చరవాణిలు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి :

రక్త సంబంధీకులే.. రాక్షసుల్లా మారితే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.