ఓ జూదంలో 25 లక్షలు పోగొట్టుకున్నానని ఓ యువకుడు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా వెళ్లిపోయాడు. తెలంగాణలోని మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి న్యూ మిర్జాలగూడలో నిఖిల్(24)అనే యువకుడు ఉండేవాడు.
వ్యసనంగా మారిన జూదంలో డబ్బులు పోగొట్టుకున్నానని తల్లిదండ్రులకు చెప్పలేకపోయాడు. ఎవ్వరికీ చెప్పకుండా లేఖ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని తండ్రి బర్ల చంద్రమౌళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : మహిళపై దాడి చేసి నిప్పింటిన దుండగుడు