కడప జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను కడప జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకన్నారు. జిల్లాలోని మైదుకూరు, కమలాపురం, ఒంటిమిట్ట మండలాలకు చెందిన జనార్ధన్ రెడ్డి, రామసుబ్బయ్య, రవిశంకర్, నాగార్జున సహా వెంకట లక్ష్మమ్మను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్పీ అన్బురాజన్ పేర్కొన్నారు.
16 కిలోల గంజాయి స్వాధీనం..
నిందితుల నుంచి 16 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సరకును కావాల్సిన వారి వద్దకే గుట్టుగా తీసుకెళ్లి విక్రయించడం, మత్తుకు బానిసలు చేయడం వంటి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్రమ గంజాయి వ్యాపారం ఎక్కడ జరిగినా పోలీసులకు సమాచారం అందించాలని కడప ప్రజలకు ఎస్పీ సూచించారు.
ఇవీ చూడండి: