ETV Bharat / city

AP Executive capital: త్వరలో విశాఖ నుంచి పరిపాలన: ఎంపీ విజయసాయి

త్వరలోనే పరిపాలన రాజధాని విశాఖకు వస్తుందని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎక్కడినుంచైనా పాలన చేయవచ్చని అన్నారు.

mp vijaya sai reddy
విశాఖకు పరిపాలన రాజధానిని తప్పక తెస్తాం
author img

By

Published : Jun 2, 2021, 5:39 PM IST

Updated : Jun 3, 2021, 7:15 AM IST

త్వరలో విశాఖ నుంచి పరిపాలన: ఎంపీ విజయసాయి

అమరావతి నుంచి కార్యనిర్వాహక రాజధానిని విశాఖకు తరలించడం తథ్యమని, ఈ ప్రక్రియ త్వరలోనే జరుగుతుందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అయితే నిర్దిష్టమైన సమయాన్ని ఇప్పుడే చెప్పలేమన్నారు. కొవిడ్‌ నియంత్రణ, విశాఖ నగర పరిధిలోని అభివృద్ధి పనులపై బుధవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ‘‘మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయం తీసుకుంది. సీఆర్‌డీఏ కేసులకు, రాజధాని తరలింపునకు సంబంధం లేదు. ముఖ్యమంత్రికి ఎక్కడి నుంచైనా పరిపాలన చేసే హక్కు ఉంది. చంద్రబాబునాయుడు కూడా కొన్నినెలలు హైదరాబాద్‌లో ఉండే రాష్ట్రాన్ని పరిపాలించారు’’ అని విజయసాయిరెడ్డి చెప్పారు.

నగర సుందరీకరణకు చర్యలు..

విశాఖ నగరం కార్యనిర్వాహక రాజధానిగా మారుతున్న నేపథ్యంలో అభివృద్ధి పనులన్నింటినీ వేగవంతం చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ముడసర్లోవ పార్క్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి జగన్‌ ప్రత్యేకంగా రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స కోసం విశాఖ నగరంలో తొమ్మిది ఆసుపత్రులను సిద్ధం చేశామన్నారు. కొవిడ్‌ నియంత్రణలో విశాఖ జిల్లా ముందువరసలో ఉందని జిల్లా యంత్రాంగాన్ని కొనియాడారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కురసాల కన్నబాబు, పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జీవీఎంసీ మేయర్‌ హరి వెంకటకుమారి, కలెక్టర్‌ వినయ్‌చంద్‌ పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

'5జీ వ్యాజ్యం'పై జూహీ చావ్లాకు హైకోర్టు ప్రశ్నలు

ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలి: జేసీ వేణుగోపాల్

Last Updated : Jun 3, 2021, 7:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.