ETV Bharat / city

'చంద్రబాబు ఏపీకి ప్రతిపక్ష నాయకుడా లేక తెలంగాణకా?'

తెదేపా అధినేత చంద్రబాబుపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. హైదరాబాద్​లో కూర్చొని రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు... ఏపీకి ప్రతిపక్ష నేతా లేక తెలంగాణకా అని ప్రశ్నించారు. ఇల్లు వదిలి ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలన్నారు.

ycp mp vijayasaireddy
ycp mp vijayasaireddy
author img

By

Published : Apr 18, 2020, 3:42 PM IST

మీడియాతో మాట్లాడుతున్న వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి

రాష్ట్రంలో సీఎం జగన్ నేతృత్వంలో సుపరిపాలన సాగుతోందని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. విశాఖలో కరోనా వ్యాప్తిని తక్కువ చేసి చూపుతున్నట్టు ప్రతిపక్షాలు అపోహలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడు హైదరాబాద్​లో కూర్చొని రాజకీయాలు చేస్తున్నారని... ఆయన ఏపీకి ప్రతిపక్ష నాయకుడా లేక తెలంగాణకా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇల్లు వదిలి వచ్చి ప్రజలకు సేవ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా విశాఖలోని 21వ వార్డులో మంత్రులు అవంతి శ్రీనివాస్, మోపిదేవి వెంకటరమణతో కలిసి కార్మికులు, వార్డు వాలంటీర్లకు సరుకులను పంపిణీ చేశారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 31 కరోనా పాజిటివ్‌ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.