Andhra University VC Anji Reddy: ఆంధ్ర విశ్వవిద్యాలయం గాంధేయ అధ్యయన కేంద్రంలో (గాంధీయన్ స్టడీస్ సెంటర్) మహాత్మా గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకుని సాముహిక ప్రార్థనలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. హిందూ, క్రైస్తవ, ముస్లిం మతాలకు చెందిన ఆధ్యాత్మిక నాయకులు ప్రార్థనలు చేసి ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచంలో శాంతి, అహింస అవసరమని నొక్కి చెప్పారు. వైస్ ఛాన్సలర్ పి.వి.జి.డి. ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మాగాంధీ ఆశయాలు అహింస, సౌభ్రాతృత్వమే నేటి దేశాల మధ్య వివాదాలకు పరిష్కారమని అన్నారు.
గాంధీతత్వాన్ని అనేక దేశాలు అవలంబించాయని తెలిపారు. పాశ్చాత్య ఆలోచనాపరులు గాంధీని శాంతి మరియు అహింసకు ప్రతిరూపంగా అధ్యయనం చేశారని వెల్లడించారు. ఈ సందర్భంగా గాంధేయ కమ్యూనికేషన్‌పై ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు.. డాక్టర్ కృష్ణవీర్ అభిషేక్‌కు ప్రసాద్‌రెడ్డి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. సెంటర్ ఓరియంటేషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. గాంధేయ అధ్యయన కేంద్రం కార్యకలాపాల గురించి డైరెక్టర్ డాక్టర్ చల్లా రామకృష్ణ వివరించారు.
ఇవీ చదవండి: