ETV Bharat / city

కారులోనే ప్రసవం... తల్లీబిడ్డ క్షేమం - woman gave birth in the car

ఆసుపత్రికి తరలిస్తుండగా కారులోనే మహిళ ప్రసవించింది. ఈ ఘటన విశాఖలో జరిగింది. అనంతరం వారిని ఆసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

woman gave birth in a car while being rushed to the hospital in vishaka

author img

By

Published : Aug 28, 2020, 11:05 PM IST

విశాఖలో రోడ్డు పక్కనే నిలిపి ఉన్న కారులో ఓ మహిళ ప్రసవించింది. సబ్బవరానికి చెందిన సాఫ్ట్​వేర్ ఉద్యోగి ముత్యాలరావు భార్య శ్రావణికి శుక్రవారం ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. ఆమెను గోపాలపట్నం వద్ద ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ఆమెకు హైబీపీ రావటంతో ప్రసవం కష్టమవుతుందన్న ఉద్దేశంతో మరో కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. చేసేదేమీలేక ఆమెను కారులో వేరే ఆసుపత్రికి తరలిస్తుండగా స్థానిక పాలిటెక్నిక్ కళాశాల వద్దకు వచ్చేసరికి పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి.

కారును రోడ్డు పక్కనే నిలపగా.. స్థానిక మహిళలు ఆమెకు పురుడు పోశారు. అనంతరం దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి వారిని తరలించారు.
తల్లి, మగ బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.