రాష్ట్రంలో ప్రధానంగా తక్కువ ఎత్తులో ఆగ్నేయ దక్షిణ గాలులు వీస్తున్నాయని.. వీటి ప్రభావం వల్ల ఉత్తర కోస్తాంధ్ర, యానాంల్లో ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులు సంభవిస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షం లేకుండా ఈ రకమైన పరిస్ధితి ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు తూర్పుగోదావరి జిల్లాలో ఉంటుందని వివరించింది. ఎల్లుండి ప్రధానంగా పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రలో నేడు, రేపు, ఎల్లుండి కూడా ప్రధానంగా పొడి వాతావరణం ఉంటుంది. రాయలసీమలోనూ ఇదే తరహాలో ఉంటుందని అంచనా వేసింది.
ఇదీ చదవండి: