President Fleet at Vizag: విశాఖలో జరగనున్న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ, మిలన్- 2022 కోసం విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవాళ నగరానికి రాష్ట్రపతి చేరుకుంటారని జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున్ తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల గవర్నర్ సైతం వస్తున్నందున తగిన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో రాష్ట్రపతి పాల్గొంటారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా.. మూడు వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు విశాఖ సీపీ మనీష్ కుమార్ సిన్హా వెల్లడించారు. గతంలో సీఎం పర్యటన సందర్భంగా ఎదురైన ట్రాఫిక్ ఇబ్బందుల వంటివి మరోసారి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు సీపీ తెలిపారు.
ఇదీ చదవండి: