భాజపా ఎంపీ అనంత్‌కుమార్ హెగ్డే వ్యాఖ్యలకు వ్యతిరేకంగా విశాఖ సీతమ్మధార బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ నాయకులు ధర్నా చేశారు. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులను దేశదోహ్రులని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వామనమూర్తి డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఆయన క్షమాపణలు చెప్పాలని కోరారు. దేశ ప్రజలు కరోనా బారిన పడి ప్రాణ రక్షణ కోసం ఆందోళన చెందుతున్న తరుణంలో ఈ విధమైన వ్యాఖ్యలు ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. హెగ్డే క్షమాపణలు చెప్పకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి :