తల్లిదండ్రుల నుంచి వచ్చిన వారసత్వ ఆస్తికి కూడా మార్కెట్ విలువ కట్టి పన్ను విధించడం దారుణమని భాజపా నేత విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. ఇలాంటి పద్ధతి ప్రపంచంలో ఎక్కడా లేదని ఆయన ఆక్షేపించారు. వైకాపా పాలనపై విమర్శలు గుప్పించిన విష్ణు..కొన్నాళ్లకు కేజీహెచ్ ఆసుపత్రిని కూడా అమ్మేస్తారని దుయ్యబట్టారు. ఆస్తి పన్ను విధింపు, సీఎం జగన్ పాలన, విశాఖలో ప్రభుత్వ భూముల అమ్మకం వ్యవహారంపైనా దుమ్మెత్తిపోశారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలు లేకుండా నియంత ధోరణితో పరిపాలన కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తి పన్నుపెంపుపై పునరాలోచించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీచదవండి
కన్న తల్లిని వద్దనుకున్నారు.. కనికరం లేకుండా రోడ్డుపై వదిలేశారు!