ETV Bharat / city

Murder in Visakhapatnam: కత్తితో దాడి.. యువకుడు మృతి - మర్డర్​

విశాఖలోని మధురవాడలో హత్య జరిగింది. దుండగులు ఓ వ్యక్తిని కత్తితో నరికి చంపారు. బాధితుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించినా.. ఫలితం లేకపోయింది. అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు తెలిపారు.

Murder
హత్య
author img

By

Published : Jul 14, 2021, 10:05 AM IST

విశాఖపట్నం మధురవాడ ఎన్జీఓస్‌ కాలనీలో... 30 ఏళ్ల వయస్సున్న వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఆ వెంటనే పరారయ్యారు. మంగళవారం రాత్రి కాలనీలో నడచి వెళ్తున్న ఆ వ్యక్తిని దుండగులు వెనుక నుంచి మెడ భాగంలో కత్తితో నరికి పరారైనట్లు తెలుస్తోంది. కొన ఊపిరితో ఉన్న బాధితుడిని స్థానికులు రుషికొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డాగ్‌స్క్వాడ్‌ బృందంతో కాలనీలో గాలింపు చర్యలు చేపట్టారు. మృతుడితోపాటు హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా లభ్యం కాలేదని పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. ​ఫోన్​ సిగ్నల్​తో కాపాడిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.