విశాఖలో జనసేన 'లాంగ్ మార్చ్', బహిరంగసభ ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ ఆర్ కె మీనా పర్యవేక్షించారు. లాంగ్ మార్చ్ రూట్ వివరాలను ఆ పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమం సజావుగా సాగేలా తగిన చర్యలు తీసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ చెప్పారు. సభా స్థలి విషయంలో మొదట కాస్త గందరగోళం తలెత్తినా.. జనసేన నాయకులు ముందుగా నిర్ణయించిన చోటే సభ నిర్వహణకు పోలీసులు సమ్మతించారు. సహకరిస్తామని భరోసా ఇచ్చిన క్రమంలో.. ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
ఇదీ చదవండి: