ETV Bharat / city

vishaka steel plant: 'కౌంటర్ దాఖలులో కేంద్రం ఆలస్యం చేస్తోంది' - ap high court on vishaka steel plant privatization

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్‌ వేసేందుకు కేంద్రం గడువు కోరింది. తదుపరి విచారణ ఆగస్టు 2కు వాయిదా పడింది.

vishaka steel plant issue case trial on high court

author img

By

Published : Jul 23, 2021, 12:13 PM IST

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వేసిన పిటిషన్‌ విచారణకు వచ్చింది. కౌంటర్‌ దాఖలుకు కేంద్ర ప్రభుత్వ న్యాయవాది సమయం కోరారు. కౌంటర్ దాఖలులో కేంద్రం ఆలస్యం చేస్తోందని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదించారు. ఈనెల 29న బిడ్డింగ్‌కు కేంద్రం పూనుకుంటోందని కోర్టుకు తెలిపారు. బిడ్డింగ్‌పై హైకోర్టు వివరణ కోరింది. అలాంటిదేమీ లేదని కేంద్రం సమాధానమిచ్చింది. ఆగస్టు 2 లోపు కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 2కు వాయిదా పడింది.

ఇదీ చదవండి:

RAINS: రాష్ట్రంలో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.