విశాఖకు చెందిన రైల్వే ఉద్యోగి కళా నైపుణ్యానికి... ఈ కళా రూపాలు అద్దం పడుతున్నాయి. మద్దిలపాలేనికి చెందిన కల్యాణ చక్రవర్తికి చిత్ర లేఖనంపై ఉన్న ఆసక్తిని గుర్తించిన ఉన్నతాధికారులు ప్రత్యేకమైన బాధ్యతను అప్పగించారు. రైల్వేడీజిల్ లోకో షెడ్లో రైళ్ల వ్యర్థసామాగ్రి చాలా ఉంటుంది. కల్యాణ చక్రవర్తి కళా నైపుణ్యంతో వీటిని ప్రయోగాత్మకంగా కళాత్మక రూపాలుగా మలచాలని భావించారు. డీఎల్ఎస్ సిబ్బంది సహకారంతో కొద్ది నెలలు పాటు శ్రమించి ఆకర్షణీయ రూపాలను తీర్చిదిద్దారు. ఇప్పుడు రైల్వే స్టేషన్, రైల్వే స్టేడియం ప్రాంగణాల్లో చక్రవర్తి కళా రూపాలు దర్శనమిస్తున్నాయి.
చక్రవర్తి వ్యర్థాలతో తీర్చిదిద్దిన ఆకృతులతో డీఎల్ఎస్ ప్రాంగణంలో ప్రత్యేకంగా క్రియేటివ్ పార్క్‌ను ఏర్పాటు చేశారు. 12 అడుగుల ఎత్తులో బేరింగులు, బుస్ రాడ్లతో తయారు చేసిన గిటార్, బేరింగులతో తీర్చిదిద్దిన గుర్రం, ఇంజిన్‌లోని సామాగ్రితో తయారు చేసిన క్రికెట్ బ్యాట్, ఫ్లవర్ వాజ్ ఇలా అనేక కళాత్మక వస్తువులు వ్యర్థాల నుంచి ఆకర్షణీయంగా రూపాంతరం చెందాయి.
రానున్న రోజుల్లో విశాఖ నగరంలో రైల్వే శాఖ నుంచి ప్రత్యేక ఆకర్షణగా ఉండే కళా రూపాన్ని తీర్చిదిద్దాలని చక్రవర్తి భావిస్తున్నారు.
ఇదీ చదవండి