విశాఖ నగరంలో సంచలనం రేపిన రూ. 100 కోట్ల విలువైన భూమి ఫోర్జరీ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖకు చెందిన శ్రీనివాసరావు, కాకినాడ చెందిన జయసూర్యను నిందితులుగా గుర్తించారు. ఫోర్జరీ సంతకాలతో భూమికి స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ సృష్టించారని సీపీ మనీష్‌కుమార్ సిన్హా తెలిపారు.
భూమి యజమాని లక్ష్మీ ప్రసన్న మధురవాడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదుతో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో వైకాపా నేత చంద్రమౌళి పాత్రపై ఆరా తీస్తున్నట్లు సీపీ వెల్లడించారు. నకిలీ పత్రాల తయారీకి సహకరించిన ఆనందరాజు అమెరికాలో ఉన్నట్లు గుర్తించారు. ఇంటర్‌పోల్ సాయంతో అతడిని త్వరలోనే అదుపులోకి తీసుకోనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: