ETV Bharat / city

యారాడ తీరంలో చిక్కుకున్న యువకులు...కాపాడిన అధికారులు

author img

By

Published : Nov 16, 2020, 8:41 AM IST

విశాఖ నగరానికి చెందిన ఏడుగురు యువకులు యారాడ తీరానికి వచ్చారు. అలలతాకిడికి వారిలోని ముగ్గురు యువకులు చిక్కుకుపోయారు. వీరిని విశాఖ న్యూ పోర్ట్ పోలీస్ బీచ్ సెక్యురిటీ టీమ్ కాపాడింది.

Visakhapatnam New Port Police Beach Security Team rescues three people in yarada coast
యారాడ తీరంలో చిక్కుకున్న యువకులు

యారాడ తీరంలో చిక్కుకున్న ముగ్గురు యువకులను విశాఖ న్యూ పోర్ట్ పోలీస్ బీచ్ సెక్యురిటీ టీమ్ కాపాడింది. ఆదివారం ఆటవిడుపుగా యారాడకు వచ్చిన ఏడుగురు యువకుల్లో...అలల తాకిడికి తీరంలోని పిట్ల కొండ వద్ద రాళ్ళల్లో ముగ్గురు యువకులు చిక్కుకున్నారు. నగరానికి చెందిన కొండ నవీన్(20), భీశెట్టి యశ్వంత్(20), కె.శ్రవణ్(20) ఇరుక్కున్నారు. మిగిలిన మిత్రులు సమాచారంతో సంఘటన స్థలానికి న్యూ పోర్ట్ పోలీసులు చేరుకున్నారు.

పోలీసుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రెవెన్యూ, రెస్క్యూ, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్ళు యువకులను రక్షించేందుకు కష్టపడ్డారు. ఎట్టకేలకు అర్ధరాత్రి ఒంటిగంటన్నర సమయంలో యువకులను రెస్క్యూ టీం రక్షించింది. ముగ్గురు యువకులను ప్రాణాలతో తీరానికి చేరుకోవటంతో..అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చదవండి:

యువకుడి గొంతు కోసిన బ్లేడ్ బ్యాచ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.