ETV Bharat / city

సందర్శకులతో సందడిగా టీయూ-142 ప్రదర్శనశాల - టీయూ 142 రీఓపెన్ వార్తలు

పెద్దలకు వినోదాన్ని, చిన్నారులకు విజ్ఞానాన్ని పంచే విశాఖ టీయూ-142 యుద్ధ విమాన ప్రదర్శనశాల సందర్శకులతో సందడిగా మారింది. సుమారు 8 నెలల తరువాత పునఃప్రారంభమైన ప్రదర్శనశాల... ఔరా అనిపించే విశేషాలను పంచుతూ సందర్శకులను ఆశ్చర్య చకితుల్ని చేస్తోంది. టీయూ-142 ఎట్టకేలకు కొవిడ్ ఆటంకాన్ని అధిగమించి... పర్యాటకులకు విజ్ఞాన సొబగుల్ని అందిస్తున్న తీరుపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

Visakha tu 142 museum
Visakha tu 142 museum
author img

By

Published : Dec 14, 2020, 5:35 PM IST

సందర్శకులతో సందడిగా టీయూ-142 ప్రదర్శనశాల

విశాఖ సాగర తీర పర్యాటకులకు అత్యద్భుత అనుభూతిని అందించే ప్రత్యేకతల్లో టీయూ-142 యుద్ధ విమాన ప్రదర్శనశాల ఒకటి. విశాఖ వచ్చిన వారు ఆర్కే బీచ్ చూడడం ఎంత సహజమో...బీచ్​ రోడ్డులో ఉన్న ఈ యుద్ధ విమాన ప్రదర్శనశాలను సందర్శించడం అంతే సహజంగా మారింది. లాక్​డౌన్ పరిణామంతో మార్చి నెల నుంచి మూతపడి ఉన్న ప్రదర్శన శాల... డిసెంబర్ 3 నుంచి తెరుచుకుంది. ఇక విశాఖ పర్యటనకు వచ్చిన వారంతా యుద్ధ విమాన ప్రదర్శనశాల విశేషాలను తిలకిస్తూ ఆనందిస్తున్నారు.

టీయూ-142 ప్రాంగణంలోకి అడుగుపెట్టేవారు కచ్చితంగా కొవిడ్ నిబంధనల్ని పాటించే విధంగా చర్యలు తీసుకున్నారు. పర్యాటకులను పరిమితంగా అనుమతిస్తున్నారు. సాధారణ రోజుల్లో వెయ్యి మందికి పైగా టీయూ-142 ప్రదర్శనశాలను సందర్శించేవారు. ప్రస్తుతం ఈ సంఖ్యను నాలుగైదు వందలకు పరిమితం చేశారు.

సుదీర్ఘ సమయం మూతపడి ఉన్నప్పటికీ ఈ యుద్ధ విమాన ప్రదర్శనశాల నిర్వహణ విషయంలో మాత్రం వీఎంఆర్డీఏ ఎక్కడా రాజీపడలేదు. ఫలితంగా ప్రస్తుతం ఇక్కడికి వస్తున్న సందర్శకులు ఎంతో సంతృప్తిగా సమయాన్ని గడుపుతున్నారు.

ప్రపంచంలోనే అరుదైన ప్రదర్శనశాలగా అలరిస్తున్న టీయూ-142 యుద్ధ విమానం... సందర్శకులకు స్వాగతం పలుకుతోంది. టీయూ-142, కురుసురా సబ్ మెరైన్ మ్యూజియాలు తిరిగి తెరుచుకోవడంతో విశాఖ నగర వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి : అమరావతి ఉద్యమంపై గీతాన్ని విడుదల చేసిన తెదేపా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.