ETV Bharat / city

విశాఖ స్టీల్​ ప్లాంట్ ఉద్యోగులు...తండ్రి పేర్లు మార్చేశారు?

విశాఖ ఉక్కు కర్మాగార ఉద్యోగులు వారి తండ్రి పేర్లు మార్చిన నిర్వాకం బయటపడింది. ఉద్యోగులకు సంస్థ ఇచ్చే ఆర్థిక ప్రయోజనాల కోసం సంస్థకు తప్పుడు వివరాలను సమర్పించారని, రికార్డులను ట్యాంపరింగ్‌ చేశారన్న ప్రచారం వెలుగులోకి వచ్చింది. 281 మంది ఉద్యోగులు వారి తండ్రి పేర్లు తప్పుగా ఇవ్వడంపై కలకలం రేగుతోంది. తండ్రి పేర్లు తప్పుగా ఇచ్చిన వారి జాబితా సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై విచారణ చేస్తే అసలు విషయం బయటపడుతుందని కొందరు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.

Visakha steel plant
Visakha steel plant
author img

By

Published : Nov 21, 2020, 4:52 PM IST

విశాఖ ఉక్కు కర్మాగారంలో కొందరు ఉద్యోగులు వారి తండ్రి పేర్లను మార్చిన ఉదంతం చర్చనీయాంశంగా మారింది. ఒకరో.. ఇద్దరో... కాదు ఏకంగా 281 మంది వారి తండ్రి పేరును తప్పుగా ఇవ్వడం కలకలం రేపింది. ఏళ్ల నాటి నుంచి విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల రికార్డులను పరిశీలించి సంస్థకు వారిచ్చిన వివరాలు సరైనవా? కావా? అన్న విషయాన్ని ప్రస్తుతం వెలికి తీయడానికి కారణాలేమై ఉంటాయన్న అంశం కర్మాగారంలో చర్చనీయాంశమైంది. ఉద్యోగుల పేర్లు, వారి గుర్తింపుకార్డు నెంబర్లు, తండ్రి పేరు, పి.ఎఫ్‌. రికార్డుల్లో ఉన్న తండ్రి పేరు, సోదర ఉద్యోగులు ఏ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు? అన్న వివరాలపై అధికారులు కూపీలాగారు.

అధికారులు ఈ మేరకు ఓ జాబితా కూడా రూపొందించారు. అందులో సుమారు 281 మంది పేర్లున్నాయి. తండ్రి పేరు తప్పుగా రాయడం వెనుక ఎలాంటి కారణాలుంటాయన్న అంశాన్ని విశ్లేషిస్తున్నారు. ఈ విషయంపై రహస్యంగా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. కొందరు ఇప్పటికే సరిచేసుకున్నారు....రికార్డుల్లో వివరాలు నమోదు చేసేటప్పుడు చిన్నచిన్న తప్పిదాలు జరగడం సహజమే. అలాంటి తప్పిదాలు జరిగినట్లు గుర్తిస్తే తరువాత రోజుల్లో తగిన ఆధారాలు చూపి ఆయా దోషాలను సవరించుకునే ప్రక్రియను అధికారులు నిర్వహిస్తారు. పేర్లలో అక్షరాలు తప్పుగా పడడం సహజంగా జరిగేదే గానీ.... ఏకంగా పేరే మారిపోయే ఉదంతాలు తక్కువగా చోటు చేసుకుంటాయి. కొందరు ఉద్యోగులు తమ రికార్డులో తప్పుగా నమోదైన వివరాలను సరి చేయించుకున్నారు. తండ్రి పేరును మార్చిన వారి నియామక ప్రక్రియను పరిశీలిస్తే వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగులు సంవత్సరాల పాటు తప్పుడు వివరాలను సవరించుకోకుండా వదిలేయడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఆర్థిక లబ్ధి కోసం తప్పుడు దారులు..!

ఉద్యోగులకు సంస్థ ఇచ్చే ఆర్థిక ప్రయోజనాలను అక్రమంగా దక్కించుకోవడం కోసం కొందరు సంస్థకు తప్పుడు వివరాలను సమర్పించారని, అందుకోసం పలు రికార్డులను ట్యాంపరింగ్‌ చేశారని ప్రచారం కూడా వెలుగులోకి వచ్చింది. సంస్థ ఇచ్చే రవాణా ఛార్జీలు ద్విచక్రవాహనాల కన్నా కార్లకు ఇచ్చే మొత్తం రెట్టింపు ఉంది. దీంతో పలువురు ద్విచక్రవాహనదారులు తమకు కారు ఉన్నట్లు నిరూపించేలా కొన్ని వాహనాల రిజిస్ట్రేషన్‌ ధ్రువపత్రాలను ట్యాంపరింగ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఆయా తప్పుడు ధ్రువపత్రాల ఆధారంగా పలువురు ఆర్థిక ప్రయోజనాలు పొందారు. అలాంటి వారి పేర్లతో కూడా అధికారులు ఒక జాబితా తయారుచేసినట్లు విశ్వసనీయ సమాచారం.

విజిలెన్స్‌ దృష్టి పెడుతుందా?

తండ్రి పేరు మార్చడంగానీ, వాహన ధ్రువపత్రాల్ని ట్యాంపరింగ్‌ చేయడంగానీ తీవ్రమైన విషయాలు. కర్మాగార విజిలెన్స్‌ విభాగం ఆయా అంశాలపై దృష్టిపెడుతుందా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే. తండ్రి పేరు తప్పుగా ఇచ్చిన ఉదంతాలు, వాహన ధ్రువపత్రాలు ట్యాంపరింగ్‌ చేసిన ఉదంతాలు ఉన్నట్లు ఓ అధికారి వెల్లడించారు. ఉద్యోగులు తప్పు చేసినట్లు నిరూపితమైతే తగిన చర్యలు తీసుకుంటామని మరో అధికారి తెలిపారు. తప్పిదాలకు పాల్పడ్డవారి పేర్లతో జాబితా రూపొందించినట్లుగానీ, వారిపై విచారణ జరుగుతున్న విషయంపై గానీ తమకు సమాచారం లేదన్నారు.

ఇదీ చదవండి : విజయసాయిరెడ్డి లేఖపై భాజపా నేతల అభ్యంతరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.