ETV Bharat / city

విశాఖ సృష్టి ఆస్పత్రి కేసు.. 14 మంది అరెస్టు - విశాఖ క్రైం వార్తలు

రాష్ట్రంలో సంచలనం రేపిన విశాఖ సృష్టి ఆస్పత్రి కేసులో పోలీసులు 14 మందిని అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు మరింత లోతుగా దర్యాప్తు చేశామని డీసీపీ ఐశ్వర్య రస్తోగి వెల్లడించారు. ఈ కేసులో చాలామంది దంపతులు మోసపోయినట్లు తెలుస్తోందని చెప్పారు.

Visakha Srishti Hospital case: 14 arrested
విశాఖ సృష్టి ఆస్పత్రి కేసు.. 14 మంది అరెస్టు
author img

By

Published : Aug 16, 2020, 8:54 PM IST

విశాఖ సృష్టి ఆస్పత్రి కేసు.. 14 మంది అరెస్టు

విశాఖ సృష్టి ఆస్పత్రి కేసులో పురోగతి కనిపిస్తోంది. సృష్టి ఆస్పత్రికి చెందిన ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం 14 మందిని అరెస్టు చేసి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో మరింత లోతుగా దర్యాప్తు చేశామని డీసీపీ ఐశ్వర్య రస్తోగి వివరించారు. సరోగసీకి వచ్చిన దంపతులకు వేరొకరి శిశువులను విక్రయించారని డీసీపీ చెప్పారు. ఈ కేసులో చాలామంది దంపతులు మోసపోయినట్లు తెలుస్తోందన్న ఐశ్వర్య రస్తోగి... ఇలాంటివి జరగకుండా వైద్యశాఖకు లేఖ రాశామని వివరించారు. కోర్టు అనుమతితో ఆడశిశువుకు డీఎన్‌ఏ పరీక్షలు చేయిస్తామని డీసీపీ ఐశ్వర్య రస్తోగి వెల్లడించారు.

ఇదీ చదవండీ... 'అప్రమత్తంగా ఉండి బాధితులను ఆదుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.