గ్యాస్ లీకేజీ ఘటనలో విషవాయువుల ప్రభావానికి రెండు రోజులుగా కళ్లు తెరవలేక ఇబ్బంది పడుతున్న మణిదీప్ ఎట్టకేలకు శనివారం కళ్లు తెరిచాడు. ‘చిన్ని కళ్లకు ఏమి తెలుసు... కన్నతండ్రి రాడని’ శీర్షికతో శనివారం ‘ఈనాడు’లో వచ్చిన కథనంతో వైద్యనిపుణులు చిన్నారి కంటి చూపుపై దృష్టి సారించారు. కేజీహెచ్ వైద్య నిపుణులు ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి బాలుడిని తరలించారు. కంటి వైద్య నిపుణులు మాల్ ఫెర్నాండేజ్ కళ్లకు పరీక్షలు జరిపారు. అప్పటికే కేజీహెచ్‌లోనూ చికిత్స చేయడంతో మణిదీప్ క్రమంగా కళ్లు తెరిచాడు. చూపునకు ఎలాంటి ప్రమాదం లేదని నేత్ర వైద్య నిపుణులు పేర్కొన్నారు.
ఇవీ చదవండి...విశాఖ విషాదం : ఆ కళ్లకేం తెలుసు కల్లోలం జరిగిందని!