ETV Bharat / city

రీమష్ తెలుగింటి టిక్ టాక్... విశాఖ యువ ఇంజినర్ల ప్రతిభకు చిహ్నం

కొత్తగా ఆలోచిస్తే... విజయం సాధించవచ్చని మరోసారి రుజువు చేశారు విశాఖ చెందిన ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. టిక్ టాక్ తరహాలో వీడియో మాధ్యమ యాప్ రీమష్ ను రూపొందించారు. చైనా యాప్ ల నిషేధం, భారతీయ యాప్ లు వినియోగం అన్న ధోరణి ఊపందుకోవడంతో రీమష్ డౌన్ లోడ్ల సంఖ్య అమాంతం పెరిగింది. ఇప్పటివరకు లక్షన్నర డౌన్ లోడ్లు జరిగాయి. విభిన్న ఫీచర్లతో రూపొందించిన రీమష్ నెటిజన్ల మన్నన పొందుతుంది. ఈ యాప్ విజయం వెనుక ఉన్న యువ ఇంజినీర్ల ప్రతిభపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

author img

By

Published : Aug 13, 2020, 8:22 PM IST

రీమష్ తెలుగింటి టిక్ టాక్... విశాఖ యువ ఇంజినర్ల ప్రతిభకు చిహ్నం
రీమష్ తెలుగింటి టిక్ టాక్... విశాఖ యువ ఇంజినర్ల ప్రతిభకు చిహ్నం

విశాఖకు చెందిన కిరణ్, నరేష్ ఇంజినీరింగ్ చదువుతున్నప్పటి నుంచి స్నేహితులు. విభిన్నంగా ఆలోచిస్తూ కొత్త అంశాలను అందరికీ పరిచయం చేయడం వీరికి అలవాటు. ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజినీరింగ్ లు పూర్తయ్యాక భారీ వేతనాలతో బహుళ జాతి కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. అనంతరం ఉద్యోగాలకు వదులుకుని సొంతంగా ఎదిగెందుకు ఆలోచన చేశారు. భిన్న ఆలోచనలతో కొత్త అంశాలపై ఎప్పుడూ దృష్టి పెట్టే వీరు... సొంతంగా సాఫ్ట్ వేర్ కంపెనీ పెట్టి యువ ఇంజినీర్లకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు.

ఎప్పటికప్పుడు విభిన్న సాఫ్ట్ వేర్ ఉత్పత్తులను రూపొందించే ఈ యువబృందం... తాజాగా టిక్ టాక్ తరహాలో రీమష్ యాప్ ను రూపొందించారు. ఎనిమిది నెలల నుంచి అభివృద్ధి చేసిన ఈ యాప్ ఇటీవలె ప్లేస్టోర్ లో విడుదల చేశారు. చైనా యాప్ ల నిషేధం, రీమష్ కూడా టిక్ టాక్ ను పోలి ఉండడంతో డౌన్ లోడ్లు పెరిగాయి. సాంకేతికంగా భారతీయులకు అవసరమైన అన్ని అంశాలను రీమష్ లో పొందుపర్చడంతో యాప్ కు ఆదరణ పెరిగింది. కేవలం ప్లేస్టోర్ పెట్టిన మూడు వారాల్లోనే లక్షకు పైగా డౌన్ లోడ్లు అయ్యాయని ఈ యువ ఇంజినీర్లు చెబుతున్నారు.

యాప్ లో ఎప్పటికప్పుడు నూతన సాంకేతిక జోడిస్తున్నామని కిరణ్ అంటున్నారు. రానున్న కాలంలో మరింతగా అభివృద్ధి చేయడానికి శ్రమిస్తున్నామని చెబుతున్నారు. వందల సంఖ్యలో టెంప్లేట్లు అందుబాటులో ఉన్న రీమష్ ఇతర యాప్ ల కన్నా విభిన్నంగా ఉంటుందని నరేష్ అంటున్నారు. రానున్న కాలంలో యాప్ ను ఐవోఎస్ లో కూడా అందుబాటులో తీసుకురానున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

ప్రభుత్వాన్ని నమ్మండి.. ప్రతిపక్షాన్ని కాదు: బొత్స

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.