పంచగ్రామాల సమస్యపై నివేదికను అందించాలని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. విశాఖ గ్రామీణ మండల పరిధిలోని అడవివరం, వెంకటాపురం, పెందుర్తి మండల పరిధిలో చీమలాపల్లి, పురుషోత్తపురం, వేపగుంట పంచగ్రామాల సమస్యపై కలెక్టర్ సమీక్షించారు. ఈ గ్రామాల్లోని భూముల వివరాలు, ఆడంగల్ ప్రకారం క్రోడీకరించి నివేదిక సమర్పించాలన్నారు. పంచ గ్రామాల సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలను సిఫార్సు చేయాలని చెప్పారు. గత రికార్డులను సిద్ధంగా ఉంచాలన్నారు.
ఇదీ చదవండి : హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టుకు నిధుల కేటాయింపు రద్దు