కాపు సమ్మేళనానికి విజయసాయిరెడ్డి రావడంపై ఆ సంఘం నాయకుల అభ్యంతరం విశాఖలో జరిగిన కాపు కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనానికి వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి రావడంపై... కొందరు కాపు నేతలు అసహనం వ్యక్తం చేశారు. సమ్మేళనంలో మాట్లాడిన విజయసాయిరెడ్డి తాను కూడా కాపునేనని, తన పదో తరగతి ధ్రువపత్రంలో తన కులం కాపు అనే రాసి ఉందన్నారు. నెల్లూరు ప్రాంతంలో కులం ఏదైనా కాపు అనే సర్టిఫికెట్లో రాస్తారన్నారు. విజయసాయిరెడ్డి ప్రసంగం పూర్తై వెళ్లిపోయాక.. కొందరు నేతలు వేదికపై ఉన్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావును నిలదీశారు. కాపు సమ్మేళనానికి వేరే వారు ఎందుకొచ్చారని అభ్యంతరం వ్యక్తం చేశారు. వేదికపై ఉన్నవారు.. ఎంపీని ఆహ్వానించలేదని సర్దిచెప్పినా కొంతసేపు గందరగోళం నెలకొంది.
ఇదీ చదవండి:
'కష్టపడే నాయకులు, కార్యకర్తలు ఉన్నంతకాలం తెదేపాకు ఏమీ కాదు'