తూర్పు నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. విశాఖపట్నం ఐఎన్ఎస్ సర్కార్స్ మైదానంలో బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. దిల్లీకి బదిలీపై వెళ్తున్న ఎ.కె.జైన్ నుంచి ఎ.బి.సింగ్ బాధ్యతలు స్వీకరించారు. తూర్పు నౌకాదళ వివిధ యూనిట్ల నుంచి జైన్.. వీడ్కోలు వందనాన్ని స్వీకరించారు. నూతన అధిపతి వైస్ అడ్మిరల్ ఎ.బి.సింగ్ పరేడ్‌ను పరిశీలించారు.
దేశ భద్రత పరిరక్షణలో నౌకాదళ పాత్ర తిరుగులేనిదని వైస్ అడ్మిరల్ ఎ.బి.సింగ్ అన్నారు. పాక్‌పై సాధించిన విజయానికి 50 వసంతాలు పూర్తయ్యాయని.. ఆపరేషన్ పవన్ శ్రీలంకలో విజయవంతంగా నిర్వహించామని ఆయన గుర్తు చేసుకున్నారు. సామర్థ్యాలు, పోరాట పాఠవాలను నవీకరించుకుంటున్నామని తెలిపారు. తూర్పు నౌకాదళం ఎలాంటి సవాళ్లకైనా సిద్ధంగా ఉందని ఎ.బి.సింగ్ అన్నారు.
ఇదీ చదవండి: