జీవీఎంసీ మేయర్ పదవిపై విశాఖ వైకాపాలో అసంతృప్తి భగ్గుమంది. వెంకట కుమారిని మేయర్‌గా ఎన్నుకోవడంపై.. 21 వార్డు కార్పొరేటర్‌గా ఎన్నికైన వైకాపా నగర అధ్యక్షుడు వంశీ కృష్ణ శ్రీనివాస్ అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. ఎంపీ విజయసాయిరెడ్డి మోసం చేశారని ఆరోపిస్తూ.. వంశీ అభిమానులు జీవీఎంసీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. మేయర్ పదవి ఇవ్వనందుకు నిరసనగా విశాఖ నగర వైకాపా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రకటించారు.
ఇదీ చదవండి: