ETV Bharat / city

Central Minister: విశాఖ చేరుకున్న కేంద్రమంత్రి శాంతను ఠాకూర్ - విశాఖ చేరుకున్న కేంద్రమంత్రి శాంతను ఠాకూర్ వార్తలు

కేంద్ర నౌకాయానశాఖ సహాయమంత్రి శాంతను ఠాకూర్ మూడు రోజుల పర్యటన నిమిత్తం విశాఖ చేరుకున్నారు. పోర్టు అభివృద్ధి కార్యక్రమాలపై కేంద్రమంత్రి సమీక్ష చేయనున్నారు.

విశాఖ చేరుకున్న కేంద్రమంత్రి శాంతను ఠాకూర్

author img

By

Published : Sep 23, 2021, 7:56 PM IST

మూడు రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర నౌకాయానశాఖ సహాయమంత్రి శాంతను ఠాకూర్ విశాఖ చేరుకున్నారు. పోర్ట్ ఛైర్మన్ కె.రామ్మోహన్ రావు ఆయనకు స్వాగతం పలికారు. విశాఖ పోర్టులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై కేంద్ర మంత్రి సమీక్షించటంతో పాటు పోర్టులో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. పోర్ట్ పరిపాలనా భవనంలో మొక్కలు నాటి స్వచ్ఛ పఖ్వాడ నిర్వహించనున్నారు. ఈ ఏడాది జూన్, జులై నెలల్లో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా నిర్వహించిన పోటీల విజేతలకు బహుమతులు అందజేయనున్నారు.

సమీక్షకు పోర్ట్ పీపీపీ నిర్వాహకులు, యూనియన్స్, అసోసియేషన్స్ సభ్యులను అధికారులు ఆహ్వానించారు. పోర్ట్ కార్యకలాపాలను లాంచ్ క్రూయిజ్ ద్వారా పర్యటించి పరిశీలిస్తారు. జెట్టీ మరమ్మతు పనులు, క్రూయిజ్ టెర్మినల్ అభివృద్ధి పనులు, కవర్డ్ స్టోరేజ్ యార్డ్ నిర్మాణ పనులు, డేగ వద్ద ట్రక్కు పార్కింగ్ టెర్మినల్ వంటి పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. కాన్వెంట్ జంక్షన్ వద్ద గ్రేడ్ సెపరేటర్​ను మంత్రి శాంతను ప్రారంభిస్తారు.

ఇదీ చదవండి: CM Jagan: మద్యం అక్రమ తయారీ, రవాణాపై ఉక్కుపాదం మోపాలి: సీఎం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.