గత మూడు రోజులుగా విశాఖ జిల్లా చోడవరంలో నిర్వహిస్తున్న 65వ అండర్-19 బాలబాలికల రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నేటితో ముగిశాయి. ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి బాలబాలికల కబడ్డీ జట్లకు ఎంపిక చేయనున్నందున ఆటగాళ్లు చక్కటి ప్రతిభ కనబరిచారు. బాలుర ఫైనల్ పోటీ విశాఖ- తూర్పు గోదావరి జిల్లా జట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగింది. చివరికి ఒక్క పాయింట్ తేడాతో విశాఖ జట్టు విజయం సాధించింది. అంతే హోరాహోరీగా సాగిన విజయనగరం- కృష్ణాజిల్లా బాలికల జట్టు ఫైనల్లో విజయనగరం బాలికల జట్టు గెలిచి ట్రోఫీ దక్కించుకుంది. అనంతరం రాష్ట్ర స్థాయి కబడ్డీ జట్టు ఎంపికను నిర్వహించారు. కార్యక్రమానికి అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు డా. సత్యవతి, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ హాజరయ్యారు.
ఇదీ చూడండి: ఉత్కంఠ భరితంగా.. రాష్ట్ర స్థాయి అండర్-17 హాకీ పోటీలు