విశాఖ రుషికొండ సముద్ర తీరానికి అభిముఖంగా శ్రీనివాసుని ఆలయాన్ని సిద్ధం చేశారు తితిదే అధికారులు. ఈ నెల 8న అంకురార్పణతో ఆలయంలో వైదిక కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. 11వ తేదీ విగ్రహ ప్రతిష్ట, 13వ తేది ఉదయం 9.45 నిముషాలకు మహా సంప్రోక్షణ.. సాయంత్రం 4గంటలకు కల్యాణం కార్యక్రమాలను తితిదే నిర్వహిస్తోంది. అలాగే ఈ నెల 13న సీఎం జగన్ సంప్రోక్షణలో పాల్గొనడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
సుమారు పదకొండు ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఈ ఆలయం నిర్మాణమైంది. విశాఖ భీమిలి రహదారి మధ్యలో రుషికొండ వద్ద ఈ వేంకటేశ్వరుని ఆలయానికి ఘాట్ రోడ్ పనులు పూర్తయ్యాయి. స్వామి తిరునామాలు ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దారు. తిరుమల - తిరుపతి శిల్పుల చేతిలో తయారైన చక్కటి శిల్ప సౌందర్యంతో ఆలయం భక్తుల కోసం సిద్ధంగా ఉంది.
ఇదీ చదవండి:
PULICHINTALA: తాత్కాలిక గేటు ఏర్పాటుకు 24 గంటలకు పైగా సమయం పడుతుంది