ETV Bharat / city

అక్కడ ఇటుకల పండుగ చేస్తారు.. ఎలాగో తెలుసా..! - విశాఖ జిల్లా తాజా వార్తలు

Tribals Unique Brick festival: గిరిజనుల జీవన శైలే ఒక ప్రత్యేకం.. గిరిజన పండుగలు కొన్ని వింతగా.. ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఇక్కడి గిరిజనులు ఏటా చైత్రమాసంలో సంప్రదాయబద్ధంగా ఓ పండుగ జరుపుకొంటారు. అదే ఇటుకల పండుగ. గిరిజన భాషలో దీనిని "చైతు పొరొబ్"​గా పిలుస్తారు. మరి, దీన్ని ఎలా జరుపుకొంటారో తెలుసుకుందామా..!

Tribals Unique Brick festival
ఇటుకల పండుగ
author img

By

Published : Apr 14, 2022, 7:48 PM IST

Updated : Apr 15, 2022, 11:45 AM IST

మన్యంలో ఇటుకల పండుగ

Tribals Unique Brick festival: అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో ప్రస్తుతం ఇటుకల పండుగ సందడి సాగుతోంది. గ్రామాల్లోని గిరిజనులంతా ఈ పండుగ వేళ.. గిరిజన సంప్రదాయ నృత్యం థింసా ప్రదర్శిస్తూ సంబరాలు చేసుకుంటారు. ఈ వేడుక వారం రోజులపాటు ఉత్సాహంగా సాగుతుంది. బంధుమిత్రులు సపరివార సమేతంగా విందు ఆరగిస్తారు. ఈ పండుగ సందర్భంగా ఓ ఆనవాయితీ ఉందండోయ్. ఉత్సవాలు జరుపుకునే వారం రోజులపాటు.. చిన్నాపెద్ద, ముసలి ముతక ఎవ్వరూ పనుల్లోకి వెళ్లరు.

వారిని చల్లటి నీటితో తడిపేస్తారు: గ్రామంలోని మగవారంతా.. సమీప కొండపైకి వెళ్లి వేటతో కాలక్షేపం చేస్తారు. మహిళలంతా గ్రూపులుగా ఏర్పడి, ఊరి పొలిమేరలో గేట్లు వేసి పజోర్ పేరుతో డబ్బులు వసూలు చేస్తుంటారు. డబ్బులు ఇచ్చిన వారినే గ్రామాల్లోకి వెళ్లేందుకు అనుమతిస్తారు. డబ్బులు ఇచ్చే వారి నుదుట బొట్టు పెట్టి గిరిజన సంప్రదాయం ప్రకారం మర్యాద చేస్తారు. డబ్బులు ఇవ్వని వారిని చల్లటి నీటితో తడిపేస్తారు. ఈ విధంగా వచ్చిన డబ్బులతో సాయంత్రం అయ్యే సరికి తినుబండారాలు కొనుక్కొని ఉల్లాసంగా థింసా నృత్యం చేస్తూ ఆనందోత్సాహాలను ప్రదర్శిస్తారు.

ఇదీ చదవండి: Bamma dance: బామ్మ డాన్స్.. ఆడియన్స్ షాక్!

Last Updated : Apr 15, 2022, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.