కరోనా ప్రభావంతో విశాఖ వాల్తేర్ డివిజన్లో పలు రైళ్లు రద్దయ్యాయి. జనతా కర్ఫ్యూలో భాగంగా రేపు 20 ప్యాసింజర్లు, 16 ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దయ్యాయి. ఈనెల 31 వరకు విశాఖ-సికింద్రాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్‌ని నిలిపివేశారు. ఏపీ ఎక్స్‌ప్రెస్ రీషెడ్యూల్ చేశారు. రేపు రాత్రి 10.15 గం.కు విశాఖలో ఏపీ ఎక్స్‌ప్రెస్ బయలుదేరనుంది.
రిఫండ్ గడువు పెంపు
రద్దయిన రైళ్లు, రద్దు చేసుకున్న ప్రయాణాల టిక్కెట్లకు నగదు పొందే గడువును రైల్వేశాఖ పెంచింది. గతంలో రైలు రద్దయితే 3 నుంచి 72 గంటల్లో రిఫండ్ తీసుకోవాలన్న నిబంధనను సడలించింది. ప్రస్తుతం 72 గంటల గడువును 45 రోజులకు రిఫండ్ గడువును పెంచింది. ప్రయాణం రద్దు చేసుకుంటే మూడ్రోజుల్లోగా రిఫండ్ చేసుకోవాలన్న నిబంధనను... 30 రోజులకు పెంచింది.
ఇదీ చదవండి : జనతా కర్ఫ్యూ కోసం 250కి పైగా రైళ్లు రద్దు