విశాఖలో టూరిజం ఎక్స్ పో పేరిట ప్రదర్శన నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో మూడు రాష్ట్రాల టూరిజం విభాగాలతో పాటు పలు ప్రైవేటు ఆపరేటర్లు పాల్గొననున్నారు. గత పదేళ్ల నుంచి విశాఖలో ఇలాంటి ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామనీ.. దీని ద్వారా విశాఖ నుంచి ఇతర ప్రదేశాలు చూసేందుకు వెళ్లేవారు ప్రత్యేక రాయితీలు పొందేందుకు వీలవుతుందని నిర్వాహకులు తెలిపారు. పర్యటక ప్రదేశాల వివరాలన్నీ ఒకే చోట అందించడమే ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ అవకాశాన్ని విశాఖ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇవీ చదవండి: