అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశం దక్కినప్పుడే ప్రజాస్వామ్య గొప్పతనం ఇనుమడిస్తుందని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ అన్నారు. అందుకే అందరూ ఎన్నికల్లో పాల్గొనాలని పిలుపిస్తున్నట్లు తెలిపారు. విజయనగరం జిల్లాలో ఎన్నికల నిర్వహణపై.... కలెక్టర్లు, ఎస్పీ, ఇతర అధికారులతో ఎస్ఈసీ సమీక్ష నిర్వహించారు. ఏర్పాట్లు బాగా చేశారంటూ అధికారులను అభినందించారు. ఇదే సమయంలో ఏకగ్రీవాలపై మరోసారి స్పష్టతనిచ్చిన ఆయన.. సమాజంలో ప్రజాస్యామ్యం బలపడాలంటే అందరి భాగస్వామ్యం అవసరమన్నారు. అలా కాకుండా బలవంతంగా ఏకగ్రీవాలు చేసుకుంటూ పోతే ప్రజాస్వామ్యం తిరోగమిస్తుందని చెప్పారు. దీనిని అర్థం చేసుకోకుండా అర్ధరహిత విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పరస్పర ఫిర్యాదులు...
అంతకుముందు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఎస్ఈసీని ఆ జిల్లాకు చెందిన తెలుగుదేశం, వైకాపా నేతలు కలిశారు. నామినేషన్ల సందర్భంగా ఆదివారం నిమ్మాడలో జరిగిన ఉద్రిక్త పరిస్థితులపై పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.ఎన్నికల సన్నద్ధతపై సమీక్షలో భాగంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్.. ఇవాళ విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు.
ఇదీ చదవండి