ETV Bharat / city

Children Missing: విశాఖ శిశుగృహం నుంచి ముగ్గురు చిన్నారులు అదృశ్యం

Children missing: విశాఖపట్నంలోని స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన శిశుగృహం నుంచి ముగ్గురు చిన్నారులు అదృశ్యమయ్యారు. వారం రోజుల క్రితమే తల్లిదండ్రుల నుంచి తప్పిపోయి ఇక్కడికి చేరిన పిల్లలు కనిపించకపోవడంతో నిర్వహకురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Three children missing
ముగ్గురు చిన్నారులు అదృశ్యం
author img

By

Published : May 4, 2022, 11:35 AM IST

Children missing: విశాఖలోని స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన శిశుగృహ రక్షణలో ఉన్న ముగ్గురు చిన్నారులు అదృశ్యమయ్యారు. ఈమేరకు ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్​లో శిశుగృహ సంరక్షకురాలు బి.మమత ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల నుంచి తప్పిపోయి రోడ్డుపైన ఉన్న ముగ్గురు చిన్నారులను వారం రోజుల క్రితం చైల్డ్ రైట్ ప్రొటెక్షన్స్ ఫోర్స్ సభ్యులు గుర్తించారు. వారి తల్లిదండ్రులు వచ్చేంత వరకు రక్షణగా ఉంచాలని కోరుతూ ఆర్ అండ్ బి కూడలి వద్ద ఉన్న శిశుగృహకు అప్పగించారు. మంగళవారం ఉదయం అల్పాహారం తీసుకున్న ఆ ముగ్గురు చిన్నారులు గేటు బయట ఆడుకుంటున్నారు. అరగంట తర్వాత వెళ్లి సంరక్షకురాలు చూసేసరికి అక్కడ లేరు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా వారి ఆచూకీ తెలియలేదు. వెంటనే ఎయిర్​పోర్ట్​ పోలీస్ స్టేషన్​లో ఆమె ఫిర్యాదు చేశారు.

కూలి పనులు చేసుకోవడానికి వేరే ప్రాంతం నుంచి వారి తల్లిదండ్రులతో ఇక్కడికి వచ్చినట్లుగా చిన్నారులు చెప్పారని శిశుగృహ అధికారులు తెలియజేశారు. ఆ ముగ్గురూ మహాలక్ష్మి ((6) ఏడుకొండలు(4), మరియమ్మ(2)) ఒకే తల్లి బిడ్డలని పేర్కొన్నారు. వారం రోజులు గడుస్తున్నప్పటికీ చిన్నారులు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఎక్కడా ఫిర్యాదు చేయలేదని, తమను సంప్రదించలేదని వారు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య.. ముగ్గురు సస్పెన్షన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.