కరోనా కారణంగా ఆరు నెలలు మూతపడిన విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం.... ఆన్ లాక్ నిబంధనలతో ఇటీవల తెరుచుకుంది. ప్రభుత్వ ఆదేశాలతో చివరి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. మిగిలిన వారికి దఫ దఫాలుగా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమయంలో ప్రత్యేకంగా కొన్ని నియమ నిబంధనలను వర్సిటీ పాటిస్తోంది. పరీక్షల సమయంలో కరోనా ప్రబలకుండా పటిష్టమైన ప్రణాళిక వేసింది. పరీక్ష సమయంలో విద్యార్థుల మధ్య మీటరు దూరం ఉండడం, బెంచ్‌కి ఒకరు మాత్రమే కూర్చుని పరీక్ష రాసే లాగా ఏర్పాట్లు చేశారు. ఒక గదిలో 20 మందిని మాత్రమే ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అలాగే విద్యార్థులు నష్టపోకుండా ఆన్లైన్ తరగతులు నిర్వహించినట్టు ఉపకులపతి ఆచార్య పి.వి. జి. ఆర్. ప్రసాద్ రెడ్డి అన్నారు
మరోవైపు ప్రవేశాలను ఈ సారి పూర్తిగా ఆన్లైన్లోనే నిర్వహిస్తున్నారు. దీనివల్ల విద్యార్థులకు, కౌన్సెలింగ్ సిబ్బందికి సర్టిఫికేట్ల అప్లోడింగ్ సులువు అవుతుందని చెప్పారు. యూనివర్సిటీలో ఏపీ ఆసెట్, ఏపీ ఈసెట్ ఆన్లైన్లో మూల్యాంకనం చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో డిజిటల్ బోధన ప్రవేశపెడుతున్నట్టు ఉపకులపతి పీవీజీఆర్ ప్రసాద్ రెడ్డి చెప్పారు. ఒకే సారి వందల మంది విద్యార్థులకు పాఠాలు చెప్పే వ్యవస్థ నిర్మిస్తున్నట్టు వివరించారు.
ఇదీ చదవండి