విశాఖ జిల్లా సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామిని...రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు, అర్చకులు మంత్రికి తీర్థ ప్రసాదాలు అందించారు.
కొండ దిగువున ఉన్న బంగారమ్మ తల్లి ఆలయంలో శనివారం రాత్రి హుండీ దొంగతనం జరగిందని ఆలయ ఈవో సూర్యకళ.. మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఆలయంలో దొంగతనం జరగడం విచారకరమని మంత్రి ముత్తంశెట్టి అన్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలించి, 24 గంటల్లో దొంగలను పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఆలయంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు.
ఇదీచదవండి.