విశాఖ జిల్లా సీతమ్మధారలోని మాజీ ఎంపీ సబ్బంహరి ఇంటి దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సబ్బంహరి ఇంటి ప్రహారీ గోడను జీవీఎంసీ సిబ్బంది కూల్చివేశారు. ఇది అక్రమ కట్టడం అని అధికారులు అంటున్నారు. ముందుగా సమాచారం ఇవ్వకుండా తొలగింపుపై సబ్బంహరి నిరసన వ్యక్తం చేశారు. అధికారులు ముందస్తుగా ఎటువంటి నోటీసు ఇవ్వలేదని అన్నారు. గోడ కూల్చివేతపై సమాధానం ఇచ్చేందుకు జీవీఎంసీ సిబ్బంది నిరాకరించారు.
ఇదీ చదవండి: దీటుగా స్పందిద్దాం...అపెక్స్ కౌన్సిల్ భేటీపై సీఎం నిర్దేశం