fog in visakhapatnam: విశాఖ పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగి.. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. లంబసింగిలో 8.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సాయంత్రం నాలుగు గంటలకే వాతావరణం చల్లగా మారుతోంది. తెల్లవారు జాము నుంచి ఉదయం 9 గంటల వరకూ పొగ మంచు దట్టంగా కమ్మేస్తోంది. మంచు కారణంగా మన్యంలో ప్రకృతి అందాలు.. మరింతగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా చెరువుల వేనం, వంజంగి, లంబసింగి ఘాట్ రోడ్డు వద్ద మంచు దృశ్యాలు మనసును దోచేస్తున్నాయి. దూరప్రాంతాల నుంచి వచ్చిన పర్యటకులకు ఈ దృశ్యాలు మధురానుభూతిని మిగిలిస్తున్నాయి.
పొగ మంచు కారణంగా.. కొన్నిచోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. పాడేరు ఘాట్ రోడ్ అమ్మవారి పాదాలు సమీపంలో.. పొగమంచు వల్ల దారి కనిపించక అదుపు తప్పి లారీ బోల్తా పడింది.
బుధవారం చింతపల్లిలో 12.3 డిగ్రీలు, లంబసింగిలో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. ఈరోజు ఉష్ణోగ్రతలు మరింత తగ్గాయి.
ఇదీ చదవండి:
WEATHER ALERTS IN AP: రాష్ట్రానికి తుపాను ముప్పు..రేపటి నుంచి ఆ జిల్లాల్లో వర్షాలు