మున్సిపల్ ఎన్నికల్లో నా భార్య ఓటమికి కారణం తెదేపా పెద్దలేనంటూ ఆ పార్టీ ఎస్సీ సెల్ నేత పొడుగు కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పార్టీ నాయకులు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విశాఖపట్నం రామ్‌నగర్‌లోని పార్టీ కార్యాలయం ఎదుట న్యాయ పోరాట దీక్ష చేపట్టారు.
నా భార్య పొడుగు సుగుణ తెదేపా తరపున విశాఖలోని 30వ డివిజన్లో పోటీ చేసింది. అయితే పార్టీ తరఫున సీటు ఇచ్చారు కానీ.. ఏ ఒక్క నాయకుడు తనకు మద్దతు తెలపలేదు అని పొడుగు కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఓడిపోయామని.. పార్టీ నాయకత్వం తమకు న్యాయం చేయాలని కోరారు.
ఇదీ చూడండి:
చంద్రబాబుకు సీఐడీ నోటీసులు.. ఈ నెల23న విచారణకు హాజరుకావాలని ఆదేశం