ETV Bharat / city

పల్లాపై ఆరోపణలు అవాస్తవం: వెలగపూడి రామకృష్ణబాబు - vishaka news

తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు ప్రభుత్వ భూముల అన్యాక్రాంతానికి పాల్పడ్డారని చేస్తున్న ఆరోపణలను తెదేపా నేతలు తప్పుపట్టారు. ఈ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు.

tdp leader velakgapudi
పల్లాపై ఆరోపణలు అవాస్తవం: వెలగపూడి రామకృష్ణబాబు
author img

By

Published : Jun 13, 2021, 4:32 PM IST

విశాఖలో తెదేపా నేత పల్లా శ్రీనివాసరావుపై భూ ఆక్రమణలకు పాల్పడినట్లు వస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఖండించారు. ప్రభుత్వ భూములను పల్లా కబ్జా చేసినట్లు నిరూపించాలన్నారు. అవి వాస్తవమని తేలితే పల్లా రాజకీయాలకు దూరమవుతారని.. నిరూపించలేకపోతే మంత్రి ముత్తంశెట్టి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: విశాఖలో ఆక్రమణల తొలగింపు.. భూముల స్వాధీనం

ప్రభుత్వ భూమిని పల్లా కబ్జా చేసినట్లు నిరూపించాలని.. లేకుంటే మంత్రి అవంతి క్షమాపణ చెప్పాలని తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు డిమాండ్ చేశారు. కబ్జా చేసినట్లు నిరూపిస్తే పల్లా శ్రీనివాసరావుపై రాజకీయాల నుంచి తప్పుకుంటారని సవాల్ విసిరారు. ప్రభుత్వ తీరుపైనా మండిపడ్డారు. కూల్చడం తప్ప కట్టడం ఈ ప్రభుత్వానికి తెలియదని విమర్శించారు. విశాఖలో ప్రభుత్వ ఆస్తుల తాకట్టుపై ప్రజలు మేలుకోవాలని.. లేకుంటే ప్రైవేటు ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందన్నారు. దీనిపై ప్రజలు ఆన్‌లైన్‌ ద్వారా ఉద్యమం నిర్వహించాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.