విశాఖలో ప్రతిపక్ష నేత చంద్రబాబు పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారని తెదేపా నేతలు తెలిపారు. పార్టీ అధినేతకు స్వాగతం పలికేందుకు కేవలం తెదేపా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులకు మాత్రమే అవకాశం కల్పిస్తామని పోలీసులు చెప్పడం సరికాదని వారు పేర్కొన్నారు. విశాఖ పోలీసు కమిషనర్ ఆర్. కె. మీనాను కలిసిన వారు... కార్యకర్తలపై పోలీసులు ఆంక్షలు విధించడంపై మండిపడ్డారు. చంద్రబాబు పర్యటన వేళ అశాంతి సృష్టించేందుకు వైకాపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వారిని ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు.
ఇవీ చదవండి: