విశాఖ నగర పోలీసు కమిషనర్ వైకాపాకు కొమ్ము కాస్తున్నారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ నజీర్ విమర్శించారు. విశాఖ తెదేపా కార్యాలయంపై దాడి జరిగిందని ఫిర్యాదు చేస్తే.. పోలీసులు కేసు నమోదు చేయలేదని మండిపడ్డారు. ఘటన జరిగి పదిరోజులైనా..ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్నారు. పోలీసులు వైకాపాకు అనుబంధ సంస్థగా పనిచేస్తున్నారని నజీర్ ఆక్షేపించారు. దాడి దృశ్యాలను మీడియాకు విడుదల చేసిన ఆయన..పోలీసులు చర్యలు తీసుకోకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.
తెదేపా కార్యాలయంపై దాడి చేసేందుకోసం వైకాపా కార్యకర్తలకు.. విశాఖ మంత్రులు, ఎమ్మెల్యేలు ట్రైనింగ్ ఇచ్చి పంపించారని విశాఖ పార్లమెంట్ స్థానం కార్యదర్శి పాసర్ల ప్రసాద్ ఆరోపించారు. పోలీసులు వైకాపా నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు.
ఇదీ చదవండి
CM Jagan: ప్రతీ గ్రామంలోని డిజిటల్ లైబ్రరీకి.. ఇంటర్నెట్ ఇవ్వండి: ముఖ్యమంత్రి జగన్